Yelo Yelo Sambaralu Song Lyrics

Yelo Yelo Sambaralu Song Lyrics

ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండీ గొల్లలు
సంతోషాలే పొంగేనండీ – హైలెస్సా
దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే
సంగీతాలే పాడాలండీ – హైలెస్సా
అంధకారాన్ని తొలగించే మహనీయుడు
పుట్టినాడండీ యేసయ్య మనదేవుడు
నిన్నే కోరి నిన్నే చేరి
ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు

లోకాలనేలేటి రారాజురా – ఉదయించె సూరీడై వచ్చాడురా
ఆకాశ వీధి – మెరిసేటి దారి – ఒకతార మురిసిందిగా (2)
దూతాళి పాడి – కొలిచారు చూడు
ఘనమైన ఒక వేడుక
ఆ గొల్లలేగా – దరువేసే చూడు
మెస్సయ్య – పుట్టాడనీ
మన మెస్సయ్య – పుట్టాడనీ

వెన్నెల్లో పూసింది ఓ సందడీ – పలికింది ఊరంతా ఈ సంగతీ
ఈ దీనుడంట – పసిబాలుడంట – వెలిసాడు మహరాజుగా (2)
మనసున్న వాడు – దయ చూపువాడు
అలనాటి అనుబంధమే
కనులారా చూడు – మనసారా వేడు
దిగి వచ్చే మనకోసమే
ఇల దిగి వచ్చే మనకోసమే

ఆ నింగి తారల్లా వెలగాలిరా – జగమంత చూసేలా బ్రతకాలిరా
వెలిగించు వాడు – మనలోని వాడు – నిలిచాడు మన తోడుగా (2)
సలిగాలి రాత్రి – పిలిసింది సూడు
మనలోన ఒక పండగ
భయమేల నీకు – దిగులేల నీకు
యేసయ్య మనకుండగా
మన యేసయ్య మనకుండగా

Leave a Comment